Foreword

There is neither a structure nor a texture to this blog. The subject matter can be anything and everything under the sky that I feel about at any given point that I happen to sit and blog rambling about everything in general. My thoughts and views are basically influenced by what I read, hear, gather, and ponder... if there is any copyright violation which I have not duly acknowledged, kindly let me know.

My world comprises of LO the little one, OA the other adult at home, kiddo the brother :)

Search This Blog

Sep 13, 2010

Naa Chitti Koona

నా చిట్టి బంగారానికి,

ఎన్ని రోజులు అయ్యింది నానా నీకు ఉత్తరం రాసి.. ప్రతి నెలా తొమ్మిదో తారీకు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి, కొత్త గౌను కొని, ఏదోకటి వండించి, దాన్నో పెద్ద వేడుక లాగ చేసి ఒక ఉత్తరం రాసి ఎంత హంగామా చేసేదాన్నో కదా!! ఇప్పుడు కూడా అదే ప్రేమ అదే మమత కాని ఎందుకో ఒక రొటీన్ లో పడిపోయింది జీవితం.  నువ్వు పడుతూ, లేస్తూ, పరుగులెడుతూ, నవ్వుతూ, తుళ్ళుతూ, ఏడుస్తూ నాకు ప్రసాదించే మధుర అనుభూతులు ఎన్నో కదా.. కేవలం తొమ్మిది నెలలు మోసి కన్నందుకు ఇంత అనుబంధం పెనవేసుకుపోతుందా, ఒక జీవన కాలానికి సరిపడే మధుర అనూభూతులని నిమ్పుతుందా?.. ఏమో, నాకు మాత్రం అంతా ఇంకా కలలాగే ఉంది.  నువ్వు లేకముందు అసలు జీవితాని ఊహించడమే కష్టంగా ఉంది.  పెద్దయ్యాక నువ్వు నన్ను తిట్టుకోవచ్చు, తిట్టేయ్యనూ వచ్చు కాని నీ చిన్నారి వయసులో నాకిచ్చన ఈ ఆనందం ముందు ఏదైనా చాల తక్కువేనేమో కదా? 

ఈ నెల దాటితే నీకు సంవత్సరంనర్ర  అనుకుంటేనే అబ్బో అనిపిస్తుంది... కాలం పరుగెడుతుంది అంటారు కాని నిజం కాదేమో నానా అలాగ మాయం ఐపోతుందేమో..

నిద్రలో నీ బోసి నవ్వులు చూస్తె నాకు నిద్ర రాదు, అలాగ అన్నిమర్చిపోయి ఆ అమాయకత్వం, ఆ నవ్వులోని దైవత్వంలో తడిసిపోవాలనిపిస్తుంది.. ముద్దుగా చేసే గారం ముచ్చటగా అనిపిస్తున్నా కూడా కేకలేయ్యాల్సి వచ్చినప్పుడు నేను పడే బాధ చెప్పలేను, కాని తప్పదు.

బుడి బుడి నడకలు నడిచే చిన్నారి తల్లి చేయి పట్టుకుని నడిపిస్తుంటే ఇంక ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తుంది.  చిట్టి చిట్టి చేతులతోటి ముఖం మీద తడుముతుంటే బాధ అంటే ఏంటో కూడా గుర్తు రాదు.


బుల్లి శీలి రాకాసి లాగ అరేయ్ ఒరేయ్ అని అందరి మీద కేకలేసి పిలుస్తుంటే ఒక పక్కన ముద్దు రెండో పక్కన అయ్యో అలవాటు ఐపోతుందేమో అని బాధ,  ఎవరికి చెప్పను.  కోపంలో వస్తువులు గిరాటేస్తుంటే అవి పట్టుకొచ్చి నిన్ను నాలుగు పీకాలి అని అనిపించే మనసుని ఎలా అదుపులో పెట్టుకోను.  నా కోపం నీకు వారసత్వంగా రాకూడదు, నా లాగ పిచ్చి దాని ముద్ర నీ మీద పడకూడదు అని ఎంత వ్యధ అనుభావిస్తనో ఎలా చెప్పను.

ఎప్పుడైనా ఎందుకు ఈ నిత్య ఘర్షణ, ఈ విరామం లేని పోరాటం అని వైరాగ్యం కమ్ముకున్నప్పుడు.. నీ చిలిపి చూపు, కిల కిల నవ్వు కనిపిస్తే చాలు ఎంతటి శక్తి వస్తుందో నాకు అర్థం కాదు.  నా బలం, బలహీనత రెండు నువ్వే బుజ్జి నాన్నలు.   ఎవరికీ లొంగని నేను నిన్ను చూసి చూడగానే పడిపోయా.. ఇప్పటికి ఆ మొదటి చూపు, ఆ తొలి స్పర్శ, నాకు ఒళ్ళంతా జల్లు మనిపిస్తుంది.


నువ్వు పుట్టక ముందు నిన్ను అలాగ పెంచాలి ఇలాగ పెంచాలి, అది నేర్పించాలి, ఇది నేర్పించాలి, ఎంతో ఆదర్శంగా తీర్చి దిద్దాలి  అని ఎన్నో అనుకున్నాను, ఇప్పుడు ప్రతి నిమిషం నీ నుంచి ఎంతో నేర్చుకుంటున్నాను.. క్షణంలో నవ్వు, క్షణంలో ఏడుపు, ఏది గుర్తుండదు, ఎప్పుడు సంతోషం, ఉన్నది నలుగురితో పంచుకోవడం, ఇష్టం ఉంటె ఆడటం, లేదంటే ఆడించటం, నీ ప్రపంచంలో కోపం, చిరాకు, బాధ సంతోషం అంటూ ప్రత్యేకంగా ఏమి లేవు, అన్నిటిని సమ దృష్టితో చూస్తావు.  పక్షులు, జంతువులు, పేద, గొప్ప, ముసలి పడుచు ఇది అది ఏది లేదు.. అన్ని సమానమే, ఏదైనా రెండు నిముషాలే.

ఎప్పుడూ నిజమే చెప్పాలి, ఎంత కష్టమైనా సరే ఎంత నిష్టూరమైనా సరే నిజాయితీగా ఉండాలి అని చెప్పాలంటే తరవాత ఈ సమాజంలో నువ్వు బ్రతకలేవేమో, అదంతా పాత చింతకాయ పచ్చదేనేమో అని ఒక్కోసారి దిగులు అనిపిస్తుంది.  తియ్యని అబదాలెన్నో చెప్పి కనికట్టు చేసే వారు బయట ఉన్నారు వాళ్ళని ఎలా గుర్తుపడతావో, అసలు గుర్తిస్తావో లేదో అని ఏదో ఆలోచనలు.  నల్లనివన్నీ నీళ్ళు తెల్లనివన్నీ పాలు అని భ్రమలో నాలాగ నిలిచిపోయి, కాదని తెలుసుకుని తల్లడిల్లిపోతావేమో అని  బెంగ... అసలు ఎప్పుడు ఇదొక ఆలోచన..

ఏదో నేర్పించాలి అనుకుంటూ, నీ నించి నేర్చుకుంటున్నా అనుకుంటూ నన్ను నేను మభ్య పెట్టుకుంటూ బ్రటికేస్తున్నానేమో కూడా..

Born intelligent and education ruined అంతే ఇదేనేమో.. ఎంతో జ్ఞానంతో పుట్టి మెల్లి మెల్లిగా అన్ని మార్చిపోటమే మనం జీవితంలో సాదిస్తున్నామేమో అనిపిస్తుంది ఒక్కోసారి నిన్ను చూస్తె.

ఏదో ఇవ్వాలి, ఏదో చెయ్యాలి అని ఒక తపనలో నిన్ను అందరికి దూరం చేస్తున్నానేమో అనిపిస్తుంది ఒక్కోసారి.  కాని చుట్టుపక్కల వాళ్ళ సూటి పోటి మాటలు విని నీ మనసులో చెరగని ముద్రలు పడకుండా ఉండటం ఎంత అవసరమో తలుచుకున్నప్పుడు ఆ నిర్ణయం ఎంత సరి ఐనదో తెలుస్తుంది.

నా చిన్ననాటి నుంచి కూడా తల్లి తండ్రి మీద ప్రేమ లేదు, వాళ్ళ మీద నాకు ఉన్న అభిప్రాయలు నేను నాకు నేనుగా ఏర్పరుచుకున్నవి కావు, నా చుట్టు ఉన్నవారి మాటలు, కబుర్లు వాళ్ళ ఏర్పడిన ఫీలింగ్స్ మాత్రమే.  ఒక మనిషి మీద ఇంకొకరికి ఎంత విషం నిమ్పగాలరో ఒక్కోసారి ఆశ్చర్యం అనిపిస్తుంది.. నేను కోల్పోయిన బాల్యం గుర్తొస్తుంది.. సాధ్యం కాని పరిస్తితుల్లో తల్లి తండ్రులు ఎవరి దేగ్గరైనా పెంచినప్పుడు  వారు ఏమి వింటున్నారో చూస్తున్నారో తెలుసుకోలేరు కదా.  నిష్కల్మషమైన మనసుని అలాగే ఉంచడం నా కనీస బాధ్యత అని నేను అనుకుంటున్నా.. ఒక మనిషి గురించి నాకు నచ్చనప్పుడు నీ దెగ్గర ఆ వ్యక్తీ గురించి మాట్లాడటం కంటే అసలు ఆ వ్యక్తీ ఉనికి నేను తెలియకుండా ఉండటం మేలేమో కదా.ఈ వీడియో చూసినప్పుడు కలిగిన భావన నువ్వు పుట్టక ముందు ఒక సైంటిఫిక్ మిరకిల్ ని కళ్ళ ముందు  చూడటం.. అదే ఇప్పుడు కలిగే భావన వర్ణించలేను, ఒక కణం చేసిన రణం, నా కంటి ముందు జీవం పోసుకుని కనిపిస్తుంటే, మైమరిచి పోవడం, మురిసిపోవడం.. ఈ చిరు జీవి చిరంజీవిగా వర్ధిల్లాలి అని ఆశించడం తప్ప నేను ఏమి చెయ్యలేను... నీ ఎదుగుదలకి కొంత కాలం గర్భంలో మాత్రం నిలుపుకున్న నాకు, జీవితతాంతం మదిలో చెరిగిపోని చోటుని ఇచ్చావు..

.. నేను మారిపోయాను నానా, చాల చాల మారాను, మార్పు అంటే భయపడే నేను, అసలు మార్పు అంటే చిరాకు పడే నేను ఎంతగానో మారిపోయాను.

ఎన్నో లక్షాల కణాలని ఓడించి ఎన్నో మార్పులకి తలవంచి ఒక గొప్ప విజేతగా పుట్టిన నిన్ను నీలోని శక్తిని మర్చిపోకుండా, నీ సామర్థ్యాన్ని మరవనియ్యకుండా చెయ్యడం ఎలా?  నీ ఉనికి నీకు ప్రశ్న కాకూడదు ఎందరో జీవితాలకి వెలుగు కావాలి అని అనుకోవడం ఒక పెద్ద కోరికా?  భగవంతుడిచ్చిన ఒక అద్బుత వరం నీ జీవితం, దాన్ని నువ్వు అలాగే నిలబెట్టుకునేలాగా చెయ్యటానికి నేను ఏమి చెయ్యగలను...

బిడ్డల్ని కంటాం కాని వారి రాతలని కాదు అని ఎందరో అంటే విన్నాను.. నిజమే.. కాని అభం శుభం తెలియని పసి మనసులో కల్మషం రేపింది ఎవరు?  ఎందుకు ఒకరు మహాత్ముడిగా మరొకరు కటినాత్మునిగా మారుతున్నారు.. ఏమి చేస్తే మన సమాజము స్టితి గతులని మనం మార్చగలం.

నిన్ను ఒక human being లాగ పెంచడం కంటే "being human " గా పెంచడం నా ధ్యేయం బంగారు.

ఏదో అయోమయంలో నాకు సరి అని తోచిన విధంగా నేను నిన్ను పెంచుకుంటున్నాను కన్నలు... ఒక్కోసారి ఎప్పుడు గబుక్కున పెద్దగా ఐపోయి నా కంటి ముందు కనిపిస్తావో అనిపిస్తుంది, ఒక్కోసారి ఇలాగే ఎప్పుడు పసి పాపలాగా ఉండిపోతే బాగుంది అనిపిస్తుంది. నిమిషానికి ఒక భావం కాని ఒకటి మాత్రం శాశ్వతం ఈ ప్రేమ, ఈ బంధం, ఈ క్షణం.

ఎప్పుడైనా కోపం వచ్చి ఎందుకురా బాబు ఈ పిల్లల్ని కనడం పడరాని పాట్లు పడటం అని విసుక్కుంటే ఈ ఉత్తరం కాస్త నాకు చూపించు.. బ్రతుకు బండిలో పడి ఆ విసుగు నీ మీద పడినప్పుడు, వెలకట్టలేని క్షణాలు ఎన్నో నాకు ప్రసాదించావు అని గుర్తుచేయ్యి... నన్ను కను అని నువ్వు నన్ను అడగలేదు, ఇలాగే పెంచు అని నువ్వు నిర్దేసించట్లేదు,  ప్రతి దానికి ఏదోఒక  అర్థం పరమార్థం ఆపాదించుకుని నేనే ఏదో చేస్తున్నాను, అది మర్చిపోయి నిన్ను దుమ్మెత్తి పోస్తే నన్ను నిలదియ్యి.. ఎవరికీ తలవంచకు, ఎక్కడ తల దించుకోకు.. చివరకి నా దెగ్గర కూడా.


ఏదో రాయాలి అని ఉంది.. ఎంతో చెప్పాలి అని ఉంది, చెప్పిందంతా సోది అనిపిస్తుంది, చెప్పాల్సింది కూడా సోదేనేమో అనికూడా అనిపిస్తుంది నాకు నేను నీకు తెలుసు కదరా రాజాలు, ఏదోకటి చెప్పెయ్యాలి... ఎలా పడతావో ఏంటో కదా నా తోటి... తప్పదురోయ్ నీకు నేను నాకు నువ్వు రాసి పెట్టి ఉన్నాం ;).. తప్పిన్చుకున్దామన్నా సరే నీకు దారి లేదు కదా :).

బోలెడంత ప్రేమతో
అమ్మ.

20 comments:

Renuka said...

Sree...what to tell you??? Really a "From the heart" post...I am thinking of how sreya responds once she is able to read all your letters..:)

Chandu said...

Sree గారు,
ఏమీ చెప్పనట్లుండి ఎన్నో చెప్పినట్లనిపించింది
చెంప తడిమి చూస్తే తగిలిని చెమ్మ
ఇది అమ్మ అభిమానంతో పెట్టిన ముద్దు కాదు
అనురాగపు ఆకాశ గంగ
మిగిల్చిన ఆర్ధ్రత అనిపించింది
God bless you both.

ఏకాంతపు దిలీప్ said...

వావ్ అంతా తెలుగులో! ఎంత ముచ్చటగా ఉందో.. మీ ఇంగ్లీషు ఎలా ప్రవహిస్తుందో తెలుగు కూడా అలానే ఉంది..

Sirisha said...

ivi anni sreya chadivaka tana reaction ela untundo teliyadu kani chala touching ga unnayi sree

HarshaBharath said...

I felt as if my mom wrote to me...

Sree said...

@Renu and Siri.. I really dont know, but she should be knowing how I felt at the time of her growing years.

@Chandu.. thanks.

@Dileep... nerchukuntunna Sreya kosam, thought expression in Telugu.. bagundi ani encourage chestunnanduku thanku.

@Harsha.. honored.

Sandhya said...

Very touching post, Sree. Keep such posts coming. Sreya will be proud of you. I bet:)

-Sandhya

Kalpana said...

Sreya will love you more dearie... :)
Manasuloni bhavanalani baagaa raasaavu...

HarshaBharath said...

http://blogs.timesofindia.indiatimes.com/extraordinaryissue/entry/a-father-who-failed

Nagamani said...

asale telugu teyyandi..mee post tho inka teyyati feeling kalugutundi..i'm also mother of a 2.5 yrs old boy..aa confusion, aa feelings..naa manasu chadivi meeru raaseremo anipistundi..
keep writing sree

-Nagamani (fellow TIAN)

ప్రణవ్ said...

అద్భుతం...
హృదయాంతరాల్లోంచి వచ్చిన అనుభవపూర్వకమైన భావాలు కనుకనే ప్రతి అక్షరంలో ప్రేమ, ఆప్యాయత, వాత్సల్యం స్ఫుటంగా కనిపిస్తున్నాయి. టచ్ చేశారు.

మీ పోస్ట్ చదువుతుంటే 'ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్నా కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్నా తెయ్యని రాగం' అన్న పాట జ్ణప్తికి వచ్చింది.

ఇంత అద్భుతంగా రాసినందుకు మీకు ఈ పాటను డెడికేట్ చేస్తున్నా... http://www.youtube.com/watch?v=lhdLoIc22Fc

పెద్దయ్యాక మీ అమ్మాయి ఇది చదివితే ఎంత సంతోషిస్తుందో... :)

Sree said...

@Sandhya... raayaali, inkaa enno anubhootulu nimpesukovaali, idenemo kada atyaasaa ante

@Nagamani.. thanks for delurking :).

@Pranav... nenekkediko ellipoyaa kada.

sreedevi said...

simply superb

sreedevi said...

simply superb

sreedevi said...

amma premaku maru peru
amma manasu pula teru
aa peru needa sokagane
nooru janmala seda teeru......

ee pata vinnaka
chemmagillani kanulundana
me post chadivaka
dravichani hrudayamunduna

mee post chadavagane
goorthochina naakentho istamaina pata adi

Sree said...

@Sreedevi

Welcome.. and thank you so much...

uttaram raayadam maanesi phonelato kaalam gadipesi manam enta kolpotunnam kada anipistundi naaku pandu talliki uttaram raastetappudu.

mounaaniki oka bhaasa vaste enta andamga untundi anipistundi okkosari...

Radha said...

hello sree.. nizam ga chala touching ga undi.. i am also a mother of two daughters.. kallalo nunchi neellu thirigai. meeru cheppindi nizam .. manam eppatiki maaram ilaane untam ani okappudu anukuntam kaani adi pillala mahatyamo leka kaala mahimo theliyadu.. we keep on change. and love that change too. i too think some times that my kids should never grow up.. should never get polluted at heart..
over all chala baagundi mee post..
mee profile lo intro chadive mee fan aipoya :)

Sree said...

@Radha.. thank you.. the best of me I think comes when I think/write about my daughter.. kids make us way too better human beings kada?

Sravya Vattikuti said...

వహ్ ! చదివాకా మాటలు లేవండి , ఎంత బాగా రాసారో !

MURALI said...

చదివాక మాటలు రాలేదు. కానీ ఏదో చెప్పాలనిపించింది ఒక్కటే మార్గం కాళ్ళ మీద పడాలనే భావం కలిగింది. ప్రపంచంలో తల్లికి మాత్రమే దక్కే గౌరవం ఈ అనుభూతి. మీ ఇద్దరూ నిండు నూరేళ్ళు హాయిగా ఉండాలని ఆశిస్తున్నా.

For Evil Eyes on LO