Foreword

There is neither a structure nor a texture to this blog. The subject matter can be anything and everything under the sky that I feel about at any given point that I happen to sit and blog rambling about everything in general. My thoughts and views are basically influenced by what I read, hear, gather, and ponder... if there is any copyright violation which I have not duly acknowledged, kindly let me know.

My world comprises of LO the little one, OA the other adult at home, kiddo the brother :)

Search This Blog

Sep 30, 2010

Suraajyamava leni swaraajyamendukani????

సీతారామ శాస్త్రి గారు గాయంలో అడిగిన ప్రశ్న అప్పుడప్పుడు మదిలో మెదులుతూ ఉంటుంది.. ఈ రోజు బెంగుళూరులో సెలవు, UP లో సెలవు, దేశమంతా red alert  అని అన్ని చానల్స్ గొగ్గోలు పెడుతుంటే నన్ను నేను ఎన్నో మార్లు అడుగుతున్నా ప్రశ్న ఇది..

బాబ్రీ మస్జిద్ అయోధ్య రామాలయం ఏది కావలి నాకు?  ఇంకో ప్రాణిలో భగవంతుని చూడలేని నేను ఒక గదిలో పెట్టిన రాతి బొమ్మలో చూడగలనా.  మోకాళ్ళ మీద కూర్చుని శిరసు నేలకు ఆన్చి నమాజ్ చేసినా, కళ్ళు మూసుకుని, తల వంచుకుని చేతులు జోడించి దణ్ణం పెట్టుకున్నా మనం ఒక భగవద్ స్వరూపానికే కదా... ముస్లిం హిందూ క్రిస్టియన్ పార్సీ అని ఎందుకు ఈ విభజనలు... పంచ భూతాలు, ప్రకృతి, ప్రాణి కోటి ఇది కాదా భగవంతుడు అంటే?

మతం అంటే ఇది నాకు ఎవరు చెప్పలేదు... సాయిబ్బులు (సాహెబ్) అంటే వాళ్ళ పేరు అనుకున్నాం కాని అది ఒక మతం అని తెలియదు.  మా అమ్మమ్మ 60 ఏళ్ళ వయసులో అలీఫ్ బె అంటూ ఉర్దూ అక్షరాలూ మౌల్వి గారి దెగ్గర నేర్చుకుంది, మా వాడకట్టు అంతా సాయిబ్బులే.. అందరు అత్తా, మామ, అక్క, అన్న, తాతాలే.. వాళ్ళ పండగలు వేరు, మాకు పాయసం పంపిస్తారు, మేక పండగ వస్తే బిర్యాని వస్తుంది, పీర్ల పండగ ఐతే ఊరేగింపు వస్తుంది, అవి పట్టుకుని మేము కూడా గంతులేసేవాళ్ళం, నిప్పుల మీద అందరూ సమంగా నడిచేవారు మొక్కు ఉన్న ప్రతి ఒక్కరు కూడా, నాకు ఒంట్లో బాగోకపోతే ముందు మసీదుకి వెళ్లి తాయెత్తు కట్టించుకోస్తారు, పండు గాడు పుట్టినప్పుడు కూడా నల్ల దారం, మంత్రించిన తావీజు కట్టించాను, వారానికోసారి బూబమ్మ వచ్చి ఇల్లంతా పొగ చూపించి నిమ్మకాయ కట్టి నెమిలి పించం విసినకర్రతోటి మాకు ఆ ధూపం చూపించి వెళ్తుంది.. మా ఊర్లో ఎప్పుడు ఎప్పుడు మతం గురించి కలహాలు జరగడం చూడలేదు.. ఇంకా చెప్పాలంటే మా ఇంట్లో మా నాన్న లాంటి వాళ్ళు క్రిస్టియన్ మతం వారు వచ్చి మాయ మాటలు చెప్పి మతము మార్చేస్తారేమో అని మమ్మల్ని చర్చికి పంపేవారు కాదు కాని హిందూ ముస్లిం మతాల మధ్య అంతరం ఉంది మనం కొట్టుకోవాలి అని ఎవరు చెప్పలేదు, చెప్పరు కూడాను.

నా చిన్న తనంలో ఎప్పుడు వినని, నా చుట్టు పక్కల ఎప్పుడు అనుభవం లోకి రాని ఈ వివక్ష, ఈ రోజు నా దేశాన్ని పట్టి పీడిస్తున్న అతి ముఖ్యమైన సమస్య.  ఈ రోజు మధ్యాహ్నమే అయోధ్య వివాదం మీద ఆఖరి తీర్పు.  అందరి గుండెల్లో రైళ్ళు పరుగేడుతున్నాయ్ అని అందరు ఘోషిస్తున్న రోజు.  టీవీలకి జనాలు అతుక్కుని పోయి కూర్చున్న రోజు.   సామాన్య ప్రజల్లో మతం అనే చాందసం లేదు, at least నేను ఎప్పుడు చూడలేదు.. ఏదో కులం, గోత్రం, గట్రా అంటూ అందరి లాగే గిరి గీసుకుని బ్రతుకుతున్నారు తప్పితే ఉన్మాదం స్థాయి లో ఉద్రేకాలు లేవు మరి వాటిని పెంచి పోషిస్తుంది ఎవరు? ఎందుకు?  అన్ని తెలివితేటలూ నాకే ఉన్నాయ్ అని విర్ర వీగే మనిషి అరె నేను ఇంకోడి చేతిలో కీలుబొమ్మలా ఎందుకు చేస్తున్నాను నా పక్కని వాడు  నాకు చేసిన నష్టం ఏంటి నేను వాడినెందుకు తగలబెట్టాలి, వాడి ఇంటిని ఎందుకు కూల్చాలి అసలు నన్ను పురిగోల్పిన వాడి కొంప కాల్చేస్తే పీడా పోతుంది అని ఎందుకు ఆలోచించలేకపోతున్నాడు.  ఆ మేడలో కూర్చేనే వాడి అబ్బ సొమ్ము ఏమాత్రం కరగట్లేదు, మనమే నిలువునా దహనం ఐపోతున్నాం, మనమే పెరిగిన ధరలతో, పగిలిన అద్దాల బస్సులతో, కాలిన కొంపల్లో, విరిగిన సామానుతోటి బ్రతుకుతున్నాము   అన్న చిన్న పాటి విజ్ఞత ఎందుకు కలగట్లేదు.. ఒకప్పుడేదో చదువులేక గుడ్డెద్దు చేలో పడ్డట్టు గొర్రె మందల్లాగా బ్రతికినా ఇప్పుడు ఇంత awareness , అవగాహన ఉంది కూడా ఎందుకు మనకి విషయం అర్థం కావట్లేదు?

India shining అంటూ చంకలు గుద్దుకోవడమే  కాని  మింగ మేతుకులేని బ్రతుకులని, వాటి కోసం ఇలాంటి వారి కొమ్ము కాచేవారిని ఎందుకు బాగు చేయ్యలేకపోతున్నాం? తప్పు ఎక్కడ ఉంది?

1949lo మొదలయిన వివాదం ఇంత వెర్రి తలలు వేసేదాకా ఎందుకు చూస్తూ ఊరుకున్నాం?  1947 లో రేగిన ఈ మతము అనే మహమ్మారి కార్చిచ్చు ఫలితం చూసి కూడా ఎందుకు మనం జాగ్రత్త పడలేకపోయాం?

నేను school లో  ఉన్నప్పుడు ఒక అర్థరాత్రి మా colony లో గోల, ఎందుకు అంటే మసీదు కూల్చారంట ఎందుకు అంటే ఏమో తెలియదు, ఐతే ఏంటి అంటే అమ్మో జాగ్రత్త ఇంట్లోనే ఉండాది బయటకి రాకండి ముస్లిమ్స్ చంపేస్తారు అదే విషయం మా ముస్లిం ఫ్రెండ్స్ ఇంట్లో చెప్పారంట హిందువులు చంపేస్తారు అని.. ఎవరు రేపెట్టారు ఈ భయాన్ని?  తరవాత inter లో ఉన్నప్పుడు మాకు college సెలవు ఎందుకు అంటే ఏదో గుడి కట్టడం కోసం జనాలు పాద యాత్ర చేస్తున్నారు, మట్టి తెచ్చి ఇస్తున్నారు, అది అయోధ్య మట్టి అంట ఇంట్లో పెట్టుకుని పూజ చెయ్యాలి అంట, RSS అని ఏదో ఒక group ఉంది, దాంట్లో ఉండే కుర్రాళ్ళందరూ కూడా వెళ్తున్నారు అంట అని చెప్పారు.. తరవాత బొంబాయి సినిమా చూసే దాక మతకలహాలు అంటే ఇంత భయంకరంగా ఉంటే అని తెలియదు.  ఎప్పుడో స్వాతంత్ర్యం రాక ముందు జరిగిన దానికి తెల్లోడు DIVIDE అండ్ RULE నేర్పించి పోయాడు అని తిట్టుకున్నాం తప్పితే, దానికి మూల కారణం Nehru Jinnah ego clash అని, అది నివారించలేని గాంధీ గారి వైఫల్యం అని ఒప్పుకోలేకపోయాం, కుటుంబ రాజకీయాలు, పదవీ కాంక్షలు, పక్షపాత వైఖరి, నిమ్మకు నీరెత్తినట్టు నాదాకా వస్తే తప్ప నాకు సంబంధం లేడు అనుకునే middle class mentality , పేదరికం, అజ్ఞానం, ఈ పూట గడిచిపోతే చాలు అనుకునే నిరుపేదల మానసిక పరిస్తితిని ఆసరా చేసుకుని వాడుకునే కొందరు మనుషుల ఆదిపత్యం కోసం చేసే పోరు అని తెలిసి తెలిసి ఏమి మాట్లాడలేని చాతకానితనం అని ఒప్పుకోము, ఒప్పుకోలేము, మనకి టైం లేదు కదా?

 ఆ రోజునా మన వేలితో మన కన్ను మనమే పోడుచుకున్నాం ఈ రోజున అదే చేస్తున్నాం.. ఏదో కాలం మారింది మనం పురోగామిస్తున్నాం అని భ్రమలో ఉన్నాం అంతే.   ఎంత కాలం కొంత మంది మనుషుల స్వార్ధం కోసం మొత్తం దేశం అంతా ఫలితం అనుభవించాలి?  ఇంకెంత కాలం.

నాకు తెలిసిన వాళ్ళెవరు ఈ గొడవలు ఇష్టపడట్లేదు, విసుక్కుంటున్నారు, ఈ తరం వారికి బాబ్రీ మసీదు అని ఒకటి ఉంది అని తెలియదు, అయోధ్యలో రాముడి గుడి కట్టాలి అని వారు అనుకోట్లేదు... అసలు ఎంత మందికి ఈ వివాదం ఏంటో తెలుసు??

నిజం చెప్పాలంటే ఈ తరాన్ని గుడి కావాలా మసీదు కావాలా అంటే ఎందుకొచ్చిన గొడవ ఒక పెద్ద shopping mall , amusement park, multiplex కట్టెయ్యండి.. ఎలాంటి గొడవ లేకుండా అందరు సుబ్బరంగా adjust అయిపోతాం అని చెప్తారు.

నన్నడిగితే ఒక హాస్పిటల్ కట్టేస్తే పోతుంది కదా అక్కడ.. ప్రాణాలు తీసుకునే కంటే ప్రాణాలు నిలిపే దేవాలయం కడితే బాగుంటుందేమో కదా??

ఏమి verdict వస్తుంది అని నాకు తెలియదు కాని మళ్లీ ఇంకో సారి ఇది జరగకూడదు అని మాత్రం గట్టిగా ఉంది.. Hindu కాదు muslim కాదు Human First and Humanity First అని ఉంది.

నాకు మనసు బాగోలేదు, చరిత్ర సిగ్గు పడే విధంగా జరిగిన కొన్ని విషయాలకి ఇక్కడితో ఒక అంతం రావాలి అని మాత్రం ఉంది.. రేపు పండు తల్లికి బంగారు లోకం కావాలి అని.. కొత్త బంగారు లోకం కావాలి అని ఉంది.

No comments:

For Evil Eyes on LO