Foreword

There is neither a structure nor a texture to this blog. The subject matter can be anything and everything under the sky that I feel about at any given point that I happen to sit and blog rambling about everything in general. My thoughts and views are basically influenced by what I read, hear, gather, and ponder... if there is any copyright violation which I have not duly acknowledged, kindly let me know.

Ref: Chichkoo is what I lovingly call my daughter, kiddo my brother, amma and taatee my late maternal grandparents, and OA is the other adult in the family.

Search This Blog

Loading...

Sep 30, 2010

Blog-a-thon

So, taking it from Rads.. Decided to go for NaBloWriMo



Maybe I am too late to be in it, I did the needful but still I would love to do this one for myself.


this month I intend to go for the blog-a-thon a post a day for the month of October.. it is tough to find something to blog on every single day.. not blogging for the sake of blogging but doing it so with jest and interest.. wish me good luck!!!

A few more people I would like to do this are
Renuka - Song of Life.
Chandu - Neninthe
Chandu - Vibrant Serenity and Hema.
Chandu - Allanta Doorana
Sphuritha - Naa Raatalu
Neelima - Dew Drop Dreams

Phew!! never really realized I really like and look forward to reading all the Chandus on the blog list :).

I would be glad if they can do so, 'cos I love reading them.. a few fun reads and a few on a serious note!! Go for it gang!!

Rote Kaayko Hum??

Disturbed thinking about the events of the day and the past in Indian history, I happened to sit and listen to this album which is good.. ARR magic on me.. Lyrics are good too, so as I retire for the day, I do so on a happy note.. kid loves the beat too, so icing on the cake, you know what is the song of tomorrow in the household ;).

Movie: Jhootha Hi Sahi

Rote kaayko hum.. hey!! Rote kaayko hum ? hona hai joho, sad hote kaayko hum ?

Cry cry itnaa cry karte hain kaayko ? Itna darte hain kaayko ?
Pal pal marte kaayko ? Why why aisa why waisa kyun hota ?

Yu hotaa to kyaa hota ? Jo hotaa hai woh hotaa,

Fly fly baby fly dekhein aan ud ke,
Dekhein baadalse judke, dekhen phir naa mud mud ke,

Rote kaayko hum -2-
Haan raaton ko naa sote kaayko ? --cry cry--


Chaar pal ka hai.. saanson kaa kissa,
Kitnaa hai hissa is mein aansuon kaa…soch lo tum
Bachpan bhi tha ek, Ek boodha saa pal…Kisne dekhaa kal,
Toh ispal kee keemat jod lo tum…

Rote kaayko hum hain, -2-
Haan raaton ko na sote kaayko ?

Baatein teri theek lagti hain…raatein kyun hamaari jagti hain,
Haalaatain hum kyun na maarein beeti baaton ko,
Bhoolu main to mujhko lagaana tum ek chaanta,
Chubh jaye to kheench lena kaanta,
No, no, no, no…

Poochun main jo tum se kabhi ke kyun kyun daanta…dena phir se ek aur chaanta,
Kabhi nahi… kabhi nahi,
Rote kaahe ko hum hain…
Haan raaton ko na sote kaayko ?


Check HERE

Suraajyamava leni swaraajyamendukani????

సీతారామ శాస్త్రి గారు గాయంలో అడిగిన ప్రశ్న అప్పుడప్పుడు మదిలో మెదులుతూ ఉంటుంది.. ఈ రోజు బెంగుళూరులో సెలవు, UP లో సెలవు, దేశమంతా red alert  అని అన్ని చానల్స్ గొగ్గోలు పెడుతుంటే నన్ను నేను ఎన్నో మార్లు అడుగుతున్నా ప్రశ్న ఇది..

బాబ్రీ మస్జిద్ అయోధ్య రామాలయం ఏది కావలి నాకు?  ఇంకో ప్రాణిలో భగవంతుని చూడలేని నేను ఒక గదిలో పెట్టిన రాతి బొమ్మలో చూడగలనా.  మోకాళ్ళ మీద కూర్చుని శిరసు నేలకు ఆన్చి నమాజ్ చేసినా, కళ్ళు మూసుకుని, తల వంచుకుని చేతులు జోడించి దణ్ణం పెట్టుకున్నా మనం ఒక భగవద్ స్వరూపానికే కదా... ముస్లిం హిందూ క్రిస్టియన్ పార్సీ అని ఎందుకు ఈ విభజనలు... పంచ భూతాలు, ప్రకృతి, ప్రాణి కోటి ఇది కాదా భగవంతుడు అంటే?

మతం అంటే ఇది నాకు ఎవరు చెప్పలేదు... సాయిబ్బులు (సాహెబ్) అంటే వాళ్ళ పేరు అనుకున్నాం కాని అది ఒక మతం అని తెలియదు.  మా అమ్మమ్మ 60 ఏళ్ళ వయసులో అలీఫ్ బె అంటూ ఉర్దూ అక్షరాలూ మౌల్వి గారి దెగ్గర నేర్చుకుంది, మా వాడకట్టు అంతా సాయిబ్బులే.. అందరు అత్తా, మామ, అక్క, అన్న, తాతాలే.. వాళ్ళ పండగలు వేరు, మాకు పాయసం పంపిస్తారు, మేక పండగ వస్తే బిర్యాని వస్తుంది, పీర్ల పండగ ఐతే ఊరేగింపు వస్తుంది, అవి పట్టుకుని మేము కూడా గంతులేసేవాళ్ళం, నిప్పుల మీద అందరూ సమంగా నడిచేవారు మొక్కు ఉన్న ప్రతి ఒక్కరు కూడా, నాకు ఒంట్లో బాగోకపోతే ముందు మసీదుకి వెళ్లి తాయెత్తు కట్టించుకోస్తారు, పండు గాడు పుట్టినప్పుడు కూడా నల్ల దారం, మంత్రించిన తావీజు కట్టించాను, వారానికోసారి బూబమ్మ వచ్చి ఇల్లంతా పొగ చూపించి నిమ్మకాయ కట్టి నెమిలి పించం విసినకర్రతోటి మాకు ఆ ధూపం చూపించి వెళ్తుంది.. మా ఊర్లో ఎప్పుడు ఎప్పుడు మతం గురించి కలహాలు జరగడం చూడలేదు.. ఇంకా చెప్పాలంటే మా ఇంట్లో మా నాన్న లాంటి వాళ్ళు క్రిస్టియన్ మతం వారు వచ్చి మాయ మాటలు చెప్పి మతము మార్చేస్తారేమో అని మమ్మల్ని చర్చికి పంపేవారు కాదు కాని హిందూ ముస్లిం మతాల మధ్య అంతరం ఉంది మనం కొట్టుకోవాలి అని ఎవరు చెప్పలేదు, చెప్పరు కూడాను.

నా చిన్న తనంలో ఎప్పుడు వినని, నా చుట్టు పక్కల ఎప్పుడు అనుభవం లోకి రాని ఈ వివక్ష, ఈ రోజు నా దేశాన్ని పట్టి పీడిస్తున్న అతి ముఖ్యమైన సమస్య.  ఈ రోజు మధ్యాహ్నమే అయోధ్య వివాదం మీద ఆఖరి తీర్పు.  అందరి గుండెల్లో రైళ్ళు పరుగేడుతున్నాయ్ అని అందరు ఘోషిస్తున్న రోజు.  టీవీలకి జనాలు అతుక్కుని పోయి కూర్చున్న రోజు.   సామాన్య ప్రజల్లో మతం అనే చాందసం లేదు, at least నేను ఎప్పుడు చూడలేదు.. ఏదో కులం, గోత్రం, గట్రా అంటూ అందరి లాగే గిరి గీసుకుని బ్రతుకుతున్నారు తప్పితే ఉన్మాదం స్థాయి లో ఉద్రేకాలు లేవు మరి వాటిని పెంచి పోషిస్తుంది ఎవరు? ఎందుకు?  అన్ని తెలివితేటలూ నాకే ఉన్నాయ్ అని విర్ర వీగే మనిషి అరె నేను ఇంకోడి చేతిలో కీలుబొమ్మలా ఎందుకు చేస్తున్నాను నా పక్కని వాడు  నాకు చేసిన నష్టం ఏంటి నేను వాడినెందుకు తగలబెట్టాలి, వాడి ఇంటిని ఎందుకు కూల్చాలి అసలు నన్ను పురిగోల్పిన వాడి కొంప కాల్చేస్తే పీడా పోతుంది అని ఎందుకు ఆలోచించలేకపోతున్నాడు.  ఆ మేడలో కూర్చేనే వాడి అబ్బ సొమ్ము ఏమాత్రం కరగట్లేదు, మనమే నిలువునా దహనం ఐపోతున్నాం, మనమే పెరిగిన ధరలతో, పగిలిన అద్దాల బస్సులతో, కాలిన కొంపల్లో, విరిగిన సామానుతోటి బ్రతుకుతున్నాము   అన్న చిన్న పాటి విజ్ఞత ఎందుకు కలగట్లేదు.. ఒకప్పుడేదో చదువులేక గుడ్డెద్దు చేలో పడ్డట్టు గొర్రె మందల్లాగా బ్రతికినా ఇప్పుడు ఇంత awareness , అవగాహన ఉంది కూడా ఎందుకు మనకి విషయం అర్థం కావట్లేదు?

India shining అంటూ చంకలు గుద్దుకోవడమే  కాని  మింగ మేతుకులేని బ్రతుకులని, వాటి కోసం ఇలాంటి వారి కొమ్ము కాచేవారిని ఎందుకు బాగు చేయ్యలేకపోతున్నాం? తప్పు ఎక్కడ ఉంది?

1949lo మొదలయిన వివాదం ఇంత వెర్రి తలలు వేసేదాకా ఎందుకు చూస్తూ ఊరుకున్నాం?  1947 లో రేగిన ఈ మతము అనే మహమ్మారి కార్చిచ్చు ఫలితం చూసి కూడా ఎందుకు మనం జాగ్రత్త పడలేకపోయాం?

నేను school లో  ఉన్నప్పుడు ఒక అర్థరాత్రి మా colony లో గోల, ఎందుకు అంటే మసీదు కూల్చారంట ఎందుకు అంటే ఏమో తెలియదు, ఐతే ఏంటి అంటే అమ్మో జాగ్రత్త ఇంట్లోనే ఉండాది బయటకి రాకండి ముస్లిమ్స్ చంపేస్తారు అదే విషయం మా ముస్లిం ఫ్రెండ్స్ ఇంట్లో చెప్పారంట హిందువులు చంపేస్తారు అని.. ఎవరు రేపెట్టారు ఈ భయాన్ని?  తరవాత inter లో ఉన్నప్పుడు మాకు college సెలవు ఎందుకు అంటే ఏదో గుడి కట్టడం కోసం జనాలు పాద యాత్ర చేస్తున్నారు, మట్టి తెచ్చి ఇస్తున్నారు, అది అయోధ్య మట్టి అంట ఇంట్లో పెట్టుకుని పూజ చెయ్యాలి అంట, RSS అని ఏదో ఒక group ఉంది, దాంట్లో ఉండే కుర్రాళ్ళందరూ కూడా వెళ్తున్నారు అంట అని చెప్పారు.. తరవాత బొంబాయి సినిమా చూసే దాక మతకలహాలు అంటే ఇంత భయంకరంగా ఉంటే అని తెలియదు.  ఎప్పుడో స్వాతంత్ర్యం రాక ముందు జరిగిన దానికి తెల్లోడు DIVIDE అండ్ RULE నేర్పించి పోయాడు అని తిట్టుకున్నాం తప్పితే, దానికి మూల కారణం Nehru Jinnah ego clash అని, అది నివారించలేని గాంధీ గారి వైఫల్యం అని ఒప్పుకోలేకపోయాం, కుటుంబ రాజకీయాలు, పదవీ కాంక్షలు, పక్షపాత వైఖరి, నిమ్మకు నీరెత్తినట్టు నాదాకా వస్తే తప్ప నాకు సంబంధం లేడు అనుకునే middle class mentality , పేదరికం, అజ్ఞానం, ఈ పూట గడిచిపోతే చాలు అనుకునే నిరుపేదల మానసిక పరిస్తితిని ఆసరా చేసుకుని వాడుకునే కొందరు మనుషుల ఆదిపత్యం కోసం చేసే పోరు అని తెలిసి తెలిసి ఏమి మాట్లాడలేని చాతకానితనం అని ఒప్పుకోము, ఒప్పుకోలేము, మనకి టైం లేదు కదా?

 ఆ రోజునా మన వేలితో మన కన్ను మనమే పోడుచుకున్నాం ఈ రోజున అదే చేస్తున్నాం.. ఏదో కాలం మారింది మనం పురోగామిస్తున్నాం అని భ్రమలో ఉన్నాం అంతే.   ఎంత కాలం కొంత మంది మనుషుల స్వార్ధం కోసం మొత్తం దేశం అంతా ఫలితం అనుభవించాలి?  ఇంకెంత కాలం.

నాకు తెలిసిన వాళ్ళెవరు ఈ గొడవలు ఇష్టపడట్లేదు, విసుక్కుంటున్నారు, ఈ తరం వారికి బాబ్రీ మసీదు అని ఒకటి ఉంది అని తెలియదు, అయోధ్యలో రాముడి గుడి కట్టాలి అని వారు అనుకోట్లేదు... అసలు ఎంత మందికి ఈ వివాదం ఏంటో తెలుసు??

నిజం చెప్పాలంటే ఈ తరాన్ని గుడి కావాలా మసీదు కావాలా అంటే ఎందుకొచ్చిన గొడవ ఒక పెద్ద shopping mall , amusement park, multiplex కట్టెయ్యండి.. ఎలాంటి గొడవ లేకుండా అందరు సుబ్బరంగా adjust అయిపోతాం అని చెప్తారు.

నన్నడిగితే ఒక హాస్పిటల్ కట్టేస్తే పోతుంది కదా అక్కడ.. ప్రాణాలు తీసుకునే కంటే ప్రాణాలు నిలిపే దేవాలయం కడితే బాగుంటుందేమో కదా??

ఏమి verdict వస్తుంది అని నాకు తెలియదు కాని మళ్లీ ఇంకో సారి ఇది జరగకూడదు అని మాత్రం గట్టిగా ఉంది.. Hindu కాదు muslim కాదు Human First and Humanity First అని ఉంది.

నాకు మనసు బాగోలేదు, చరిత్ర సిగ్గు పడే విధంగా జరిగిన కొన్ని విషయాలకి ఇక్కడితో ఒక అంతం రావాలి అని మాత్రం ఉంది.. రేపు పండు తల్లికి బంగారు లోకం కావాలి అని.. కొత్త బంగారు లోకం కావాలి అని ఉంది.

Sep 27, 2010

Growing up pains..

Nope, this is not the daughter I am talking about.. it is the pains that I have as she grows up.

Like you know, I have been the worst at restarting my job citing health, stress, daughter and what not as the reasons to keep away from it. Nothing seemed to work, no amount of self motivation, just kind of picks up the momentum and then there is a halt yet again.. but today things change..

Usually the daughter walks in when I work and insists on sitting on the lap and look at the lappy when mamma works touching and typing in things, mamma screaming and almost crying :(.. but out of the blue transition happens...

She walks in and looks at me inquisitively.. I say "amma job bangaaru..

She just gives a smile, blinks her eyes, says "bye amma.. oo daa (you come)." and goes off happily calling "gaagu" the new aide to play with her.

She has come to terms with the fact that I need to work and she needs to cooperate with that.. kids have amazing sensors!!

At this rate, I am the only one who needs to do some serious growing up.

Goes on to prove that no matter how much I crib, I love being clinged on to by the kid, all the pretense of being tired of her running around me is just a facade because I know it is not going to last long.. defensive mechanism at its best!!!

Sep 26, 2010

Peddarikam

జీవితం అంటే ఎన్నో ఆటు పోట్లు అంటారు అది నిజం అని కూడా తెలుస్తుంది కాని మన కంటి ముందు గడిచిన సమయం, మన గుప్పిడి నించి జారిన ఇసుక రేనువుల్లాగా అనిపిస్తుంది.  వినటానికి ఎంతో దూరంగా అనిపిస్తుంది, మన దాక రాదులే అనిపిస్తుంది కాని నిజం ఎన్నాళ్ళు తప్పించుకుంటాను ఎప్పుడో ఒకప్పుడు ఎదురుగా నిలుస్తుంది నిలదీస్తుంది..

ఏదో నిర్వేదం తోటి కాలం వెళ్ళదీస్తున్న నాకు నాలో మార్పు బాగా తెలుస్తుంది కాని అది మనసు అంగీకరించట్లేదు అనుకుంటా ఎప్పుడో ఖాళీగా ఉన్నప్పుడు పోరు పెడుతుంది

వినాయక చవితి వచ్చింది, వెళ్ళింది, నేను కూడా పండగ చేసాను, పండు తోటి చేయించాను.. ఇద్దరిలోను ఉత్సాహం లేదు, తనకి ఏమి తెలియక లేదు నాకు ఎక్కువగా తెలిసిపోయి లేదు అనిపిస్తుంది ఇప్పుడు.

వినాయకుడు పందిళ్ళు ఆటలు పాటలు, గంతులు కేరింతలు, పిండి వంటలు, టీవిలో కొత్త సినిమాలు, పందిరిలో వేసే స్క్రీన్ సినిమాలు, మొత్తం మీద బలాదూర్ తిరిగే టైం నాకు చిన్నప్పటి నించి కూడా, ప్రతి రోజు ఊర్లో ఎన్ని వినాయకుడి బొమ్మలున్నాయ్, ఎక్కడ ఏమి ప్రసాదం పెట్టారు, ఈరోజు ఏమి ప్రోగ్రాం చేస్తున్నారు, డాన్సు, పాటలు, సినిమాలు, మిమిక్రీ, డ్రామా అంటూ వెతికి నచ్చిన చోట ఆగిపోయి ఎప్పటికో ఇంటికి చేరి తిట్లు తినడం.. అంతవరకే నాకు పండుగ అంటే.

కొంచెం పెద్దగ అయ్యాక, బుద్ధిగా పూజ చేసుకోడం వండుకోటం, తినడం, అక్షింతలు మర్చిపోకుండా వేసుకోడం, టీవిలో ప్రోగ్రామ్స్ చూడటం, ఫ్రెండ్స్ వస్తే బొమ్మలు చూసి రావడం, నిమజ్జన రోజున రోడ్ మీద నుంచుని వచ్చే పోయే బొమ్మలని 11 , 21 , 51 అని ఎంతో కొంత అనుకుని చూసేసి దణ్ణం పెట్టుకుని వెళ్ళిపోవడం, అంతవరకే నాకు తెలిసింది.  గులాం కొట్టుకుని రోడ్లెంమాట పరుగెత్తడం, తీన్ మార్ స్టెప్పులు వేసుకుంటూ డప్పు డాన్సులు చెయ్యడం అంటే ఒక craze . నేను చెయ్యకపోయినా చేసే వాళ్ళని చూడటం భలే సరదా.. ఇప్పుడు నా కూతురు వేసే గంతులు అంటే పిచ్చి ప్రాణం కూడాను.. ఎప్పుడు పెద్దగ అయ్యి తీన్మార్ చేస్తుంది అని వెయిటింగ్ కూడా :).

సంబరం, వేడుక, పండుగ అంటే సంతోషం..


ఇప్పుడు

గల్లి గల్లి లో పెట్టిన బొమ్మలకి చందాలు ఇవ్వాలి, ఊర్లో ఎక్కడ పెట్టినా అందరికి పెద్ద మొత్తాలు సమర్పించుకోవాలి, చిన్నప్పుడు ఏవైతే సరదాగా అనిపించేవో అవే ఇప్పుడు దండగ అనిపిస్తున్నాయ్.  ఏమి ఊరంతా ఒక్కొకరు పెట్టాలా ఒకటి పెట్టుకుని అందరు అక్కడ దణ్ణం పెట్టుకోవచ్చుగా అనిపిస్తుంది.  ఆ డబ్బు ఏదైనా మంచి పనికి పెట్టొచ్చు కదా అనిపిస్తుంది అన్నిటిని కూడా materialistic దృష్టి తో చూడటం అలవాటయ్యింది.. నేను చిన్నప్పుడు పడ్డ సంబరం నా తరవాతి తరం కూడా పడాలి కదా, అవే వాళ్లకి తరవాత జీవితంలో మధుర అనుభూతులు కదా అనిపిస్తుంది ఒక వైపు.  మనిషి contradictory thoughts తోటి కొట్టుమిట్టాడుతూ ఉంటాడు అది నిజమే కాని మరీ నాకు పైత్యం పెరిగిపోతుంది అనిపిస్తుంది...

ఏది ఏమి అయినా కూడా   బాల్యం అంటే ఎంత బాగుటుంది కదా ఇవేమీ ఉండవు, మంచి చెడు విచక్షణ ఉండవు, ఉండవలసిన అవసరం కూడా లేదు, పండగ అంటే కేవలం దాంట్లో మంచి మాత్రమే మన దాక వస్తుంది, ఖర్చు, అది ఎక్కడి నించి తేవాలి అని ధ్యాస మనకు ఉండదు, పట్టదు కూడా... నా దాక వచ్చేపాటికి ఆ నొప్పి బాగా తెలుస్తుంది కదా.. ఒకప్పుడు ఎంటబ్బ తాత వచ్చినోళ్ళ మీద కేకలేస్తాడు ఎల్లి ప్రసాదం తెచ్చుకుంటే పోతుంది కదా అనిపించేది కదా నాకు ఇప్పుడు ఎందుకు అలాగ సర్డుకోలేకపోతున్న.. మోసే దాకా వస్తేనే కదా నొప్పి తెలుస్తుంది... అదే చేతి నిండా డబ్బు ఉన్నా కూడా నేను ఇదే రకంగా అలోచిస్తానేమో, బహుశా డబ్బుకి అది ఉండటాని లేకపోవడానికి ఈ విషయంతో సంబంధం లేదేమో, కేవలం ఆలోచనలేనేమో.. ఏమో?

Sep 23, 2010

Om namo siva rudraaya... khaleja song rocks!!

Woke up a little lazy with wheezing and stress but felt refreshed after listening to the Sada Siva song from Mahesh's Khaleja..

One thinng about Mahesh's movies like Atanu, okkadu or Pokiri is that I can watch them any time and still have the feel of watching them for the first time.. love that crisp reserved dialogues from that chocolate faced guy... we are contemporaries, just love that guy for being so private yet so powerful... all that aside.. a loved the lyrics of the song, not really a rocking song but something really touched me, the drum beats, the voice, the lyrics.. or maybe on the whole everything...

Cant wait  for the movie after the Athidi debacle.. for the starters.. song maatram mast...

not a conventional masala song but has everything, the drum beats me and the kid so love.., now you know what rocks in the house today!!!-----

Movie:  Khaleja

om namo siva rudhraaya.
om namo sithikantaaya
om namo hara naagaabharanaaya, pranavaaya..
dhama dhama dhamarukanaadanandaaya ..

om namo nitalaakshaaya
om namo bhasmaangaaya.
om namo himashailavaranaaya, pramadhaay
dhimi dhimi thaandavakeli lolaaya


sadaa sivaa, sanyaasi... taapasi, kailaasavaasee.
nee paadha mudhralu mosee,
pongipoyinaadhi palle kasee

ye soopula sukkaani daariga
sukkala tivaasi meediga
sooda sakkani saami diginaaduraa.
yeseyraa ooru vaada dandora.


ye rangula hongula poda ledura
eedu jangama sankara sivudenura
nippu gonthuna nilapu maccha saacchiga
nee taapam saapam teerche vaadera.

paipaikalaa... bhairagilaaa.. untaadi raaa aa leelaa.
lokaala neletodu, neeku saayam kaakapodu
neelone koluvunnodu, ninnu daati pone podu ..


om namashiva jai jai jai, om namashiva jai jai jai
om namashiva
groove to the trance and say jai jai jai  
sing along and sing a Shiva Shambho all the way

om namashiva jai jai jai
heal the world is all we pray
save our lives and take our pain away
jai jai jai ..
sing along and sing a Shiva Shambho all the way


sada siva -2-

yekkada veedunte nindugaa.
akkada nelantha pandagaa
chuttu pakkala cheekati pellaginchagaa.
adugesaadanta kaache doralaaga
manchunu mantanu oka teerugaa
lekka seyyane seyyani sankarayyagaa
ukku panchagaa oopiri nilipaadura
manakandaa dandaa veede nikaramga
saame ante haamee tanai untaaduraa....chivarantaa.
lokaala neletoduneeku saayam kaakapodu
aye.. neelone koluvunnodu .. ninnu dhaati pone podu ..


Om namah.. -2-

Check Here to check it out.

Come to say of instant falling in love.. both me and the kid!!!

Sep 17, 2010

Nee Navvu Cheppindi Naato..

A cute sweet lovely my type of a listening to in a mellow mood melody from the movie Antam.. I love this song a lot, saw it on Gemini Music the other day and cant get it out of my mind and needless to say the audience is obviously my daughter.. the asthma, cough and breathlessness is rendering it impossible to sing but jab manho to rastaa nikal aata hai, I hum it in my mind ;)

Movie: Antam

nee navvu cheppindi naaato nenevvaro emito
nee needa choopindi naaalo innaala lotemito -2-

naakai chaachina nee chetilo, chadivaanu naa ninna nee-2-
naato saagina nee adugulo choosaanu mana repu nee
panchenduke okaru leni batukenta baruvo anee
etodukee nochukoni nadakenta alupo anee


nallani nee kanupaapalalo udayaalu kanipinchanee
vennela pere vinipinchani nadireyi kariginchanee
naa pedavilonoo ilaage chirunavvu pudutundanee
nee siggu naa jeevitaana toli muggu pedutundanee

yenaadaite ee jeevitam rettimpu baruvekkuno
tanuvu manasu cherisagamani panchaali anipinchuno
sarigaa ade subhamuhoortam sampoorna mayyenduku
maname maro kotta janmam pondeti bandhaalaku.. aaahh laaalalaaala.. --nee navvu--

I dont really like Nag's looks in this pic but do understand that typical all too well.. i love RGV, Nag and it is not like i dont like Urmila, so this is good listen and a good watch too...

check it out.

Sep 13, 2010

Naa Chitti Koona

నా చిట్టి బంగారానికి,

ఎన్ని రోజులు అయ్యింది నానా నీకు ఉత్తరం రాసి.. ప్రతి నెలా తొమ్మిదో తారీకు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి, కొత్త గౌను కొని, ఏదోకటి వండించి, దాన్నో పెద్ద వేడుక లాగ చేసి ఒక ఉత్తరం రాసి ఎంత హంగామా చేసేదాన్నో కదా!! ఇప్పుడు కూడా అదే ప్రేమ అదే మమత కాని ఎందుకో ఒక రొటీన్ లో పడిపోయింది జీవితం.  నువ్వు పడుతూ, లేస్తూ, పరుగులెడుతూ, నవ్వుతూ, తుళ్ళుతూ, ఏడుస్తూ నాకు ప్రసాదించే మధుర అనుభూతులు ఎన్నో కదా.. కేవలం తొమ్మిది నెలలు మోసి కన్నందుకు ఇంత అనుబంధం పెనవేసుకుపోతుందా, ఒక జీవన కాలానికి సరిపడే మధుర అనూభూతులని నిమ్పుతుందా?.. ఏమో, నాకు మాత్రం అంతా ఇంకా కలలాగే ఉంది.  నువ్వు లేకముందు అసలు జీవితాని ఊహించడమే కష్టంగా ఉంది.  పెద్దయ్యాక నువ్వు నన్ను తిట్టుకోవచ్చు, తిట్టేయ్యనూ వచ్చు కాని నీ చిన్నారి వయసులో నాకిచ్చన ఈ ఆనందం ముందు ఏదైనా చాల తక్కువేనేమో కదా? 

ఈ నెల దాటితే నీకు సంవత్సరంనర్ర  అనుకుంటేనే అబ్బో అనిపిస్తుంది... కాలం పరుగెడుతుంది అంటారు కాని నిజం కాదేమో నానా అలాగ మాయం ఐపోతుందేమో..

నిద్రలో నీ బోసి నవ్వులు చూస్తె నాకు నిద్ర రాదు, అలాగ అన్నిమర్చిపోయి ఆ అమాయకత్వం, ఆ నవ్వులోని దైవత్వంలో తడిసిపోవాలనిపిస్తుంది.. ముద్దుగా చేసే గారం ముచ్చటగా అనిపిస్తున్నా కూడా కేకలేయ్యాల్సి వచ్చినప్పుడు నేను పడే బాధ చెప్పలేను, కాని తప్పదు.

బుడి బుడి నడకలు నడిచే చిన్నారి తల్లి చేయి పట్టుకుని నడిపిస్తుంటే ఇంక ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తుంది.  చిట్టి చిట్టి చేతులతోటి ముఖం మీద తడుముతుంటే బాధ అంటే ఏంటో కూడా గుర్తు రాదు.


బుల్లి శీలి రాకాసి లాగ అరేయ్ ఒరేయ్ అని అందరి మీద కేకలేసి పిలుస్తుంటే ఒక పక్కన ముద్దు రెండో పక్కన అయ్యో అలవాటు ఐపోతుందేమో అని బాధ,  ఎవరికి చెప్పను.  కోపంలో వస్తువులు గిరాటేస్తుంటే అవి పట్టుకొచ్చి నిన్ను నాలుగు పీకాలి అని అనిపించే మనసుని ఎలా అదుపులో పెట్టుకోను.  నా కోపం నీకు వారసత్వంగా రాకూడదు, నా లాగ పిచ్చి దాని ముద్ర నీ మీద పడకూడదు అని ఎంత వ్యధ అనుభావిస్తనో ఎలా చెప్పను.

ఎప్పుడైనా ఎందుకు ఈ నిత్య ఘర్షణ, ఈ విరామం లేని పోరాటం అని వైరాగ్యం కమ్ముకున్నప్పుడు.. నీ చిలిపి చూపు, కిల కిల నవ్వు కనిపిస్తే చాలు ఎంతటి శక్తి వస్తుందో నాకు అర్థం కాదు.  నా బలం, బలహీనత రెండు నువ్వే బుజ్జి నాన్నలు.   ఎవరికీ లొంగని నేను నిన్ను చూసి చూడగానే పడిపోయా.. ఇప్పటికి ఆ మొదటి చూపు, ఆ తొలి స్పర్శ, నాకు ఒళ్ళంతా జల్లు మనిపిస్తుంది.


నువ్వు పుట్టక ముందు నిన్ను అలాగ పెంచాలి ఇలాగ పెంచాలి, అది నేర్పించాలి, ఇది నేర్పించాలి, ఎంతో ఆదర్శంగా తీర్చి దిద్దాలి  అని ఎన్నో అనుకున్నాను, ఇప్పుడు ప్రతి నిమిషం నీ నుంచి ఎంతో నేర్చుకుంటున్నాను.. క్షణంలో నవ్వు, క్షణంలో ఏడుపు, ఏది గుర్తుండదు, ఎప్పుడు సంతోషం, ఉన్నది నలుగురితో పంచుకోవడం, ఇష్టం ఉంటె ఆడటం, లేదంటే ఆడించటం, నీ ప్రపంచంలో కోపం, చిరాకు, బాధ సంతోషం అంటూ ప్రత్యేకంగా ఏమి లేవు, అన్నిటిని సమ దృష్టితో చూస్తావు.  పక్షులు, జంతువులు, పేద, గొప్ప, ముసలి పడుచు ఇది అది ఏది లేదు.. అన్ని సమానమే, ఏదైనా రెండు నిముషాలే.

ఎప్పుడూ నిజమే చెప్పాలి, ఎంత కష్టమైనా సరే ఎంత నిష్టూరమైనా సరే నిజాయితీగా ఉండాలి అని చెప్పాలంటే తరవాత ఈ సమాజంలో నువ్వు బ్రతకలేవేమో, అదంతా పాత చింతకాయ పచ్చదేనేమో అని ఒక్కోసారి దిగులు అనిపిస్తుంది.  తియ్యని అబదాలెన్నో చెప్పి కనికట్టు చేసే వారు బయట ఉన్నారు వాళ్ళని ఎలా గుర్తుపడతావో, అసలు గుర్తిస్తావో లేదో అని ఏదో ఆలోచనలు.  నల్లనివన్నీ నీళ్ళు తెల్లనివన్నీ పాలు అని భ్రమలో నాలాగ నిలిచిపోయి, కాదని తెలుసుకుని తల్లడిల్లిపోతావేమో అని  బెంగ... అసలు ఎప్పుడు ఇదొక ఆలోచన..

ఏదో నేర్పించాలి అనుకుంటూ, నీ నించి నేర్చుకుంటున్నా అనుకుంటూ నన్ను నేను మభ్య పెట్టుకుంటూ బ్రటికేస్తున్నానేమో కూడా..

Born intelligent and education ruined అంతే ఇదేనేమో.. ఎంతో జ్ఞానంతో పుట్టి మెల్లి మెల్లిగా అన్ని మార్చిపోటమే మనం జీవితంలో సాదిస్తున్నామేమో అనిపిస్తుంది ఒక్కోసారి నిన్ను చూస్తె.

ఏదో ఇవ్వాలి, ఏదో చెయ్యాలి అని ఒక తపనలో నిన్ను అందరికి దూరం చేస్తున్నానేమో అనిపిస్తుంది ఒక్కోసారి.  కాని చుట్టుపక్కల వాళ్ళ సూటి పోటి మాటలు విని నీ మనసులో చెరగని ముద్రలు పడకుండా ఉండటం ఎంత అవసరమో తలుచుకున్నప్పుడు ఆ నిర్ణయం ఎంత సరి ఐనదో తెలుస్తుంది.

నా చిన్ననాటి నుంచి కూడా తల్లి తండ్రి మీద ప్రేమ లేదు, వాళ్ళ మీద నాకు ఉన్న అభిప్రాయలు నేను నాకు నేనుగా ఏర్పరుచుకున్నవి కావు, నా చుట్టు ఉన్నవారి మాటలు, కబుర్లు వాళ్ళ ఏర్పడిన ఫీలింగ్స్ మాత్రమే.  ఒక మనిషి మీద ఇంకొకరికి ఎంత విషం నిమ్పగాలరో ఒక్కోసారి ఆశ్చర్యం అనిపిస్తుంది.. నేను కోల్పోయిన బాల్యం గుర్తొస్తుంది.. సాధ్యం కాని పరిస్తితుల్లో తల్లి తండ్రులు ఎవరి దేగ్గరైనా పెంచినప్పుడు  వారు ఏమి వింటున్నారో చూస్తున్నారో తెలుసుకోలేరు కదా.  నిష్కల్మషమైన మనసుని అలాగే ఉంచడం నా కనీస బాధ్యత అని నేను అనుకుంటున్నా.. ఒక మనిషి గురించి నాకు నచ్చనప్పుడు నీ దెగ్గర ఆ వ్యక్తీ గురించి మాట్లాడటం కంటే అసలు ఆ వ్యక్తీ ఉనికి నేను తెలియకుండా ఉండటం మేలేమో కదా.



ఈ వీడియో చూసినప్పుడు కలిగిన భావన నువ్వు పుట్టక ముందు ఒక సైంటిఫిక్ మిరకిల్ ని కళ్ళ ముందు  చూడటం.. అదే ఇప్పుడు కలిగే భావన వర్ణించలేను, ఒక కణం చేసిన రణం, నా కంటి ముందు జీవం పోసుకుని కనిపిస్తుంటే, మైమరిచి పోవడం, మురిసిపోవడం.. ఈ చిరు జీవి చిరంజీవిగా వర్ధిల్లాలి అని ఆశించడం తప్ప నేను ఏమి చెయ్యలేను... నీ ఎదుగుదలకి కొంత కాలం గర్భంలో మాత్రం నిలుపుకున్న నాకు, జీవితతాంతం మదిలో చెరిగిపోని చోటుని ఇచ్చావు..

.. నేను మారిపోయాను నానా, చాల చాల మారాను, మార్పు అంటే భయపడే నేను, అసలు మార్పు అంటే చిరాకు పడే నేను ఎంతగానో మారిపోయాను.

ఎన్నో లక్షాల కణాలని ఓడించి ఎన్నో మార్పులకి తలవంచి ఒక గొప్ప విజేతగా పుట్టిన నిన్ను నీలోని శక్తిని మర్చిపోకుండా, నీ సామర్థ్యాన్ని మరవనియ్యకుండా చెయ్యడం ఎలా?  నీ ఉనికి నీకు ప్రశ్న కాకూడదు ఎందరో జీవితాలకి వెలుగు కావాలి అని అనుకోవడం ఒక పెద్ద కోరికా?  భగవంతుడిచ్చిన ఒక అద్బుత వరం నీ జీవితం, దాన్ని నువ్వు అలాగే నిలబెట్టుకునేలాగా చెయ్యటానికి నేను ఏమి చెయ్యగలను...

బిడ్డల్ని కంటాం కాని వారి రాతలని కాదు అని ఎందరో అంటే విన్నాను.. నిజమే.. కాని అభం శుభం తెలియని పసి మనసులో కల్మషం రేపింది ఎవరు?  ఎందుకు ఒకరు మహాత్ముడిగా మరొకరు కటినాత్మునిగా మారుతున్నారు.. ఏమి చేస్తే మన సమాజము స్టితి గతులని మనం మార్చగలం.

నిన్ను ఒక human being లాగ పెంచడం కంటే "being human " గా పెంచడం నా ధ్యేయం బంగారు.

ఏదో అయోమయంలో నాకు సరి అని తోచిన విధంగా నేను నిన్ను పెంచుకుంటున్నాను కన్నలు... ఒక్కోసారి ఎప్పుడు గబుక్కున పెద్దగా ఐపోయి నా కంటి ముందు కనిపిస్తావో అనిపిస్తుంది, ఒక్కోసారి ఇలాగే ఎప్పుడు పసి పాపలాగా ఉండిపోతే బాగుంది అనిపిస్తుంది. నిమిషానికి ఒక భావం కాని ఒకటి మాత్రం శాశ్వతం ఈ ప్రేమ, ఈ బంధం, ఈ క్షణం.

ఎప్పుడైనా కోపం వచ్చి ఎందుకురా బాబు ఈ పిల్లల్ని కనడం పడరాని పాట్లు పడటం అని విసుక్కుంటే ఈ ఉత్తరం కాస్త నాకు చూపించు.. బ్రతుకు బండిలో పడి ఆ విసుగు నీ మీద పడినప్పుడు, వెలకట్టలేని క్షణాలు ఎన్నో నాకు ప్రసాదించావు అని గుర్తుచేయ్యి... నన్ను కను అని నువ్వు నన్ను అడగలేదు, ఇలాగే పెంచు అని నువ్వు నిర్దేసించట్లేదు,  ప్రతి దానికి ఏదోఒక  అర్థం పరమార్థం ఆపాదించుకుని నేనే ఏదో చేస్తున్నాను, అది మర్చిపోయి నిన్ను దుమ్మెత్తి పోస్తే నన్ను నిలదియ్యి.. ఎవరికీ తలవంచకు, ఎక్కడ తల దించుకోకు.. చివరకి నా దెగ్గర కూడా.


ఏదో రాయాలి అని ఉంది.. ఎంతో చెప్పాలి అని ఉంది, చెప్పిందంతా సోది అనిపిస్తుంది, చెప్పాల్సింది కూడా సోదేనేమో అనికూడా అనిపిస్తుంది నాకు నేను నీకు తెలుసు కదరా రాజాలు, ఏదోకటి చెప్పెయ్యాలి... ఎలా పడతావో ఏంటో కదా నా తోటి... తప్పదురోయ్ నీకు నేను నాకు నువ్వు రాసి పెట్టి ఉన్నాం ;).. తప్పిన్చుకున్దామన్నా సరే నీకు దారి లేదు కదా :).

బోలెడంత ప్రేమతో
అమ్మ.

Sep 8, 2010

I am in awe..

of this cute cute baby called Naina... those telugu padyaalu, slokaas, songs and the memory... the expression with which she speaks the words or sings the songs scream out loud... pure and real form of perfection... there were goose bumps many a times listening to her songs.. blessed is the kid to have the elders to teach her those and blessed are the elders to listen to these from the mouth of this teeny tiny angel...

The vemana padyaalu and sumati satakaalu from her mouth in her voice just simply take me to another world...

check out a whole lot of other videos by directly watching in the you tube...



The kid is already blessed but she gets a load more from me...

On that note, do I rush to teach my kid all these right away, not really... not yet at least.

Sep 6, 2010

Whirlwind

of activities, emotions and events in the past few days... it has been raining cats and dogs.. i dont know why the phrase but it is raining real bad, sick and tired of it all...

had taken one break from the job to check out on a friend who is in an abusive relationship for quite long that she no longer even realizes she is in one, yes the very same I was really angry with a few months earlier, so finally got to move a little ahead with the help of her parents and siblings and hit the guy black and blue.. he deserved that by the way.. i just wish someone can drill in some sense into the lady though!! anyways, am done and out handing over the responsibility to her parents and I have a letter in writing as to what this guy wants to do to mend the situation.. not that it is needed but just buying some time for the lady to see sense.

health is limping back to normalcy.. i am rearranging the house to make more room for the kid to play and the dust and the rain and the kid in toe with no maid on hand is making things move at a snail pace but am happy at the outcome.. will put up pictures in the pic blog some time soon...

Work has gone for a toss... 3 days off back to back.. bad really really really bad!!!

When the old maid was gone without notice, I felt bad, really worse in fact because I had given her the worst of the yelling I ever did but then when the reality dawned I feel I am blessed though a little late.. so here I let go the maid who was with the kid in her growing up months, no doubt of great help to me when I was very much alone, but like I always say there is God above who watches over me... I am relieved as there is no covering for her follies, I am peaceful because I dont really have to keep a tab as to what is happening in the house...

I don't need a full-time maid any longer, I can make do with some help with cleaning and vessels and am good for the day....

Sep 1, 2010

Off the hook

There was a time when a telephone was the lifeline... good old new job days where the mobile or the land line receiver seemed like a natural extension to the ear chatting away to glory with friends, acquaintances, relatives, etc.. then came a slowdown in the phase and cell phone gradually disappeared from the scene once I went to US and it was just the unlimited in the US land line connectivity and a load of jobless dependent housewife friends kept that connectivity alive... However, once back in India phone seems to be a mess, especially the cell phone, the service provider calls, the ring tone calls, the advertisement calls, the marketing calls.. it wont be an exaggeration to say more than half of the calls I get are of such nature.

Thanks to my ear problem and the nature of my job which necessitates earphone usage I limit myself from using the phone to absolute must timings.

Now to me phone is something which I use only when I want to use, like when I go out and need to communicate with the family when I am out or I need to talk something really important to anyone.

People say me having 4 phones 2 landlines and two mobiles is a complete waste 'cos I answer none of them and the only way is they leave me a mail message or as sms so that I see later on and catch up with them.  To be honest, I dont really care what they say.. it feels good to be off the hook.. no wonder people were way too happy back then no TV, no cell phones :)).

Well I would say at this moment, the phones are me to get in touch with world not the world to get in touch with me.. I use it only when I absolutely need to.

The phone has been working off and on for the past few days and I dont really care as to get it repaired.

For Evil Eyes on LO