Foreword

There is neither a structure nor a texture to this blog. The subject matter can be anything and everything under the sky that I feel about at any given point that I happen to sit and blog rambling about everything in general. My thoughts and views are basically influenced by what I read, hear, gather, and ponder... if there is any copyright violation which I have not duly acknowledged, kindly let me know.

My world comprises of LO the little one, OA the other adult at home, kiddo the brother :)

Search This Blog

Mar 1, 2013

Midhunam - Review - Naa Madhanam

పూర్ణిమ చాల రోజుల క్రితం ఈ సినిమా చూసి వచ్చి, చాలా బాగుంది తప్పకుండా చూద్దండి అని చెప్పినప్పటి నించి చాల చాల ఎదురు చూసాను ఎప్పుడు చూడగలనా దీన్ని అని.. అందరు ఆహ ఓహో భరణి, లక్ష్మి, బాలు అంటుంటే కనీసం ట్రైలర్ అన్నా చూడాలి అన్న ఆశ చంపుకుని మరీ ఆగాను, ఒకటే సారి ఆస్వాదించాలి అని.   మా దేశంలో ఎక్కడైనా వస్తే వెళ్దామా అంటే మా పండు గాడికి సినిమా నచ్చట్లేదు, ఇంకా youku  లో పెడతాడా, youtube లో పెడతాడా, dvd  రిలీజ్ చేస్తాడా అని ఎదురు చూసి, ఎదురు చూసి చివరాఖరికి ఇవ్వాళ youku  ఉన్న లింకు పని చేస్తోంది అని గాయత్రీ బంగారం చెప్పే పాటికి ఆహా, ఓహో, ఈహా, ఊహ, అని చింపిరి గంతులేసుకుంటూ మరీ చూసేశాను .

నాకు ఉన్న తెలుగు పరిజ్ఞానానికి, రమణ గారి పుస్తకాలు ఏవో కొన్ని తప్ప పెద్దవి ముట్టుకోడానికి నేను సాహసించలేదు, మిధునం అనే పుస్తకం పేరు కూడా వినలేదు, కాబట్టి నేను చదవలేదు, అందులో ఏమి కదా ఉందొ నాకు తెలియదు, అమ్మ నాన్నల ప్రేమకధ అంటే పాతకాలపు ప్రేమకధ అని మాత్రం అనుకున్నాను.

ఈ మధ్యన సుందరకాండ (ఛార్మి) సినిమా చూసినప్పుడు, బాపు గారి సినిమా నన్ను నిరాశ  పరిచింది... ముందు రమణ గారి పుస్తకం కదా ఎలాగుంటుందో అనిపించింది కూడా ఒక మూలన కాని తరవాత తెలిసింది అది శ్రీ రమణ గారు రాసారని... ఏది ఐతేనేమి ఒక పుస్తకానికి దృశ్య రూపం నాకు ఎప్పుడు నచ్చలేదు కాని ఈ విషయంలో మాత్రం అది అంతా నిరర్ధకం అని చూసినాక తెలిసింది.

కేవలం ఇద్దరు నటులతోటి, పల్లెటూరి వాతావరణంలో తీసిన సినిమా రెండు గంటలు ఏమి చూపిస్తారు, ఎంత బాగుంటుంది అనుకుంటే, అదిగో అక్కడ తెలుస్తుంది మనకి భరణి గారి ప్రతిభ.  నేను పుస్తకం చదవలేదు కాని రమణ గారి  మార్కు పోకుండా, కదా పట్టు సడలకుండా, ప్రేక్షకుడి ఆసక్తికి భంగం లేకుండా పూర్తి నిడివి చాలా బాగా తీశారు.  ఆ పాత్రలతో పాటు జీవించిన అనుభూతిని మిగిల్చారు.  ఇలా ఉంటే  బాగుండు అనిపించడమే కాదు సాధ్యమే అనిపించేలా చేసారు.

టైటిల్స్ దెగ్గర నించి చాలా జ్ఞాపకాలు నెమరు వేసుకున్నాను, పాటల్లో, ద్వారం లక్ష్మి గారి పేరు, కధకి మూలం మర్చిపోకుండా చెప్పడం, ఆకాశవాణి లో ఎప్పుడో ఎక్కడో, జ్ఞాపకాల పొరల మధ్యదాగుండి పోయిన గొంతులు వినడం, ఆ అనుభూతికి లోను కావడం, ఏమని వర్ణించను, ఎంతని పొగడను.  లక్ష్మి గారి నటన బాలు ప్రతిభ, ఆ ఇల్లు, వాకిలి, చెట్లు, ఆవు, దూడ చెరువు గట్టు, ఊరి మట్టి అన్నీ, ప్రతి ఒక్కటి నన్ను మరో లోకానికి తీసుకెళ్ళిపోయింది.

సినిమా సారం ఏంటి అంటే...

అమ్మమ్మదొరికావా, అర్థనారీశ్వర... విడి విడిగా వెతికాను... ఒక చోటే కలిశారా. 

 అనే చిలిపి గొంతుతో వచ్చిన బుల్లి పాట  చరణం.

అదే ఈ కధకి ప్రాణం, అప్ప దాసు, బుచ్చి లక్ష్మిల దాంపత్యానికి సారం.


ఎన్నెన్నో జ్ఞాపకాలు...

***ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తాహ శ్రుయన్థామ్, ప్రవాచకః బలదేవానంద సాగర.. అంటూ సంస్కృతం వార్తలు...
***కేయూరాణి న భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా.... సతతం వాగ్భూషణ భూషణం  అనే శ్లోకం పాట
***దూదిని ఏకడం.
***ఆ ఇంటి ప్రతి అణువు, ఇత్తడి గిన్నెలు, మట్టి అలకడం, ముగ్గులు, అటక, అరటి ఆకు భోజనం

చాలా చాలా ఇష్టమైన ఎన్నో బోలెడు జ్ఞాపకాలు అన్ని తెర  మీద కనిపించడం.. ఒక మధురమైన అనుభూతి

ఈ కాలంలో ఇలా జరుగుతుందా, అలా బ్రతకడం సాధ్యమేనా, అన్ని ఎన్నో ఆలోచనలు... మాకు ఒక కోరిక, అన్ని బాధ్యతలు తీరిపోయినాక ఊర్లో పొలం చేసుకుంటూ ఉండిపోవాలి అని, అన్ని వదిలేసి, ఈ కొత్తమోహం, కంప్యూటర్, ఇంటర్నెట్ అన్ని వదిలేసి ఉండగలమా అని ఆలోచనలు అటుంచి చాల సాధ్యం అనిపించేలా ఉంది.

ఎన్నో జ్ఞాపకాలు, కొబ్బరి ఆకు బూరలు చేసుకోవడం, మా అమ్మమ్మని గుర్తు చేసింది, తను చేసి పెడితే తన చుట్టూ పిపి డుం  డుం  అనుకుంటూ ఆడటం, తను దూది ఏకడం, వంటలు చెయ్యటం, రోట్లో రుబ్బడం, వంటలు, ఆ నీళ్ళ గుండిగలు... తనకి కూడా అప్ప దాసు లాంటి భాగ స్వామి దొరికితే జీవితం ఎంత బాగుండేది అనిపించింది ఒక్క క్షణం, తాతయ్య అంటే ఇష్టం బాగా ఉన్నా కూడా, అమ్మమ్మ కోల్పోయింది ఏంటో ఇంకా బాగా అర్థం అయ్యింది.. రేపు నేను OA  అలా ఉండగలమా అంటే అది ఒకరి చూసి కోరుకునేది, అనుకరించేది కాదు, మనసులోంచి రావాలి అని తెలుస్తోంది...

మిధునం ఒక అపురూప దృశ్య కావ్యం.3 comments:

ramesh said...

మీరు మిథునం వ్రాసింది ముళ్ళపూడి వెంకట రమణ గారు అనుకుంటున్నారా? కాదు, శ్రీరమణ గారండి.

Sree said...

aunu ramesh gaaru nenu mundara mana mullapudi venkata ramana gaaru ane anukunnaanu, taravata telisindi.. thank you letting me know again :).

Nagamani said...

ee movie release mundu hyd book fair lo aa book ni chusaa...konni stalls lo special shelf pettaru aa book ki..
movie chaala manchi anubuthi ni migilchindi..maa ammamma ki chupinchalekapoya theatre lo..adhe badha..tanu hyd vachetappatiki movie ledu..manchi DVD print kosam searching...

For Evil Eyes on LO